విదేశీ తండ్రి, సౌదీ తల్లి సంతానానికి పెన్షన్ ప్రయోజనాలు
- June 29, 2021
సౌదీ: విదేశీ తండ్రి, సౌదీ తల్లికి జన్మించిన పిల్లలకు కూడా సామాజిక భద్రత కల్పించేలా కొత్త బెన్ఫిట్ స్కీంను ప్రకటించింది సౌదీ ప్రభుత్వం. దీంతో సామాజిక భద్రతకు అర్హత ప్రాతిపాదికగా ఉండే ఆర్టికల్ 6 మేరకు నాన్-సౌదీ చిల్డ్రన్స్ తమ తల్లులకు వచ్చే పెన్షన్ ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు కానున్నారు. అంటే వితంతువులు, విడాకులు పొందిన తల్లులకు వచ్చే పెన్షన్ తో విదేశీ తండ్రుల సంతానం కూడా ప్రయోజనం పొందేందుకు ప్రభుత్వం అమోదం తెలిపింది. అయితే..ఇందుకోసం వితంతు, విడాకులు పొందిన మహిళలు తాము విదేశీ వ్యక్తిని వివాహమాడినట్లు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అలాగే పర్మినెంట్ అడ్రస్ జత పర్చాలి. వరుసగా మూడు నెలలు కింగ్డమ్ విడిచి ఉండకూడదు లేదా పెన్షన్ ప్రయోజనం పొందే సమయం నుంచి ఏడాది కాలంలో ముందు వరుసగా మూడు నెలలు విదేశాల్లో ఉండకూడదు. ట్రాన్స్ పోర్ట్ పాస్ ఉన్న అనాథలు, అంగవైకల్యం ఉన్న వారు కూడా తగిన ఆధారాలతో ప్రయోజనం పొందవచ్చు. ఇదిలాఉంటే ప్రభుత్వం ఆమోదించిన ఈ పెన్షన్ ప్రయోజనాల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోగా సంబంధిత అధికారులు తమ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అప్లై చేసుకున్న నాటి నుంచి 20 రోజుల్లో దరఖాస్తును ఆమోదించటమో, తిరస్కరించటమో చేయాలి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







