ప్లాస్టిక్ వేస్ట్ మీద పోరాటంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: ఎంఎంఈ
- June 29, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ (ఎంఎంఈ), పౌరులు అలాగే నివాసితులంతా ప్లాస్టిక్ వేస్ట్ వ్యతిరేక పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విజ్నప్తి చేసింది ఎంఎంఈ. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే (3 జులై) నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ మీద పోరాటంపై తమ తమ సలహాలు, సూచనలను #FutureWithoutPlastic అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా తెలియజేయాలని కోరింది. ప్రత్యేక కార్యక్రమం ద్వారా అందర్నీ ఈ ఉద్యమంలో భాగస్వాముల్ని చేయడమే కాకుండా, పార్టిసిపెంట్లకు బహుమతులు కూడా అందజేయనున్నారు. కాగా, ఖతార్ 2.5 మిలియన్ టన్నుల మునిసిపల్ సాలిడ్ వేస్ట్ ప్రతి ఏడాదీ ఉ్పత్తి చేస్తోంది. ఇందులో 8 శాతం మాత్రమే రీసైకిల్ జరుగుతోంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో ఈ వేస్ట్ ఇంకా ఎక్కువగా ఉత్పత్తి అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రీసైక్లింగ్ అలాగే వేస్టేజీని తగ్గించడంపై ఫోకస్ పెట్టాలని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు తీర్మానిస్తున్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







