ఈ-గవర్నమెంట్ మొబైల్ అప్లికేషన్ ప్రారంభం

- June 30, 2021 , by Maagulf
ఈ-గవర్నమెంట్ మొబైల్ అప్లికేషన్ ప్రారంభం

మనామా: ఇన్ఫర్మేషన్ మరియు ఇ-గవర్నమెంట్ అథారిటీ (ఐజిఎ), క్రెడిమాక్స్ సంస్థతో కలిసి ఇ-గవర్నమెంట్ మొబైల్ అప్లికేషన్ విషయమై ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సేవల్ని అత్యాధునిక అంశాలను పొందుపర్చే ఈ అప్లికేషన్ అందుబాటులోకి వస్తోంది. ఈ కార్యక్రమానికి ఐజిఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ అలి అల్ కయీద్, క్రెడిమాక్స్ సీఈఓ అహ్మద్ ఎ సయెది, ఐజిఎ డిప్యూటీ సీఈఓ, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్మేషన్ డాక్టర్ జకారియా అహ్మద్ అల్ ఖజా, అలి అల్ మిషాల్ తదితరులు హాజరయ్యారు. పౌరులు అలాగే నివాసితులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో ఈ అప్లికేషన్ అవసరం ఏర్పడింది. ఉన్నత స్థాయిలో భద్రత కలిగి వుండేలా ఈ అప్లికేషన్ రూపొందింది. అత్యంత వేగవంతమైన మరియు యూనిఫైడ్ పేమెంట్ సర్వీస్ కూడా అందిస్తుంది ఈ అప్లికేషన్. ప్రభుత్వ లావాదేవీల కోసం ఈ ఫీచర్ పొందుపరిచారు. ప్రభుత్వ నోటిఫికేషన్లను వినియోగదారులకు పంపించడం, అధికారిక డిజిటల్ డాక్యుమెంట్ పోర్టుఫోలియో, అపాయింట్మెంట్ బుకింగ్ సేవలు వంటివాటిని ఇందులో పొందుపరిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com