46,000 బహ్రెయినీ దినార్ల మనీ లాండరింగ్: ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
- July 01, 2021
మనామా: ఇద్దరు వ్యక్తులకు మనీ లాండరింగ్ కేసులో న్యాయస్థానం జైలు శిక్ష అలాగే జరిమానా విధించింది. నిందితులు 46,000 బహ్రెయినీ దినార్ల మనీ లాండరింగ్ చేసినట్లు విచారణలో తేలింది. ఓ నిందితుడికి 8,000 బహ్రెయినీ దినార్ల జరిమానా విధించింది న్యాయస్థానం. కాగా, 24,000 బహ్రెయినీ దినార్లను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకోవాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.రెండో నిందితుడికి కూడా 8,000 దినార్ల జరిమానా విధించింది. ఈ నిందితుడి నుంచి 21,000 బహ్రెయినీ దినార్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది న్యాయస్థానం.డ్రగ్స్ అమ్మకం ద్వారా నిందితులు డబ్బు పోగేసినట్లు విచారణలో తేల్చారు. అలా 48,000 దినార్ల మొత్తాన్ని పోగేశారు నిందితులు.గుర్తు తెలియని ప్రాంతంలో డ్రగ్స్ దాచి, వినియోగదారుల్ని ఆకర్షించి వారికి వాటిని సరఫరా చేసేవారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం