భారత్, పాకిస్తాన్ తో సహా 14 దేశాలపై ట్రావెల్ బ్యాన్
- July 02, 2021
యూఏఈ: భారత్, పాకిస్తాన్ తో పాటు కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండే దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్లు యూఏఈ స్పష్టం చేసింది. ట్రావెల్ బ్యాన్ లిస్టులో ఉన్న దేశాలకు తమ పౌరులకు ప్రయాణించొద్దని, ఆయా దేశాల నుంచి ఎవరిని అనుమతించబోమని వెల్లడించింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియత్నాం, నమీబియా, జాంబియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సియెర్రా లియోన్, లైబీరియా, దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాలకు వెళ్లడాన్ని నిషేధించినట్లు విదేశీ వ్యవహారాల మరియు అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ (మోఫాయిక్), జాతీయ అత్యవసర సంక్షోభ, విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్‌సిఇఎంఎ) ప్రకటించాయి. అయితే..దౌత్య వ్యవహారలకు సంబంధించి ప్రయాణాలకు మినహాయింపు ఉంటుంది. అలాగే అత్యవసర చికిత్స, ప్రభుత్వ అధికారులు, బిజినెస్, టెక్నికల్ డెలిగేట్స్ కు కూడా మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!