NPCIL లో ఉద్యోగాలు..
- July 02, 2021
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియా (NPCIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థ కర్ణాటకలోని కైగా సైట్లో ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోనున్నారు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 9 నుంచి ప్రారంభమవుతోన్న వేళ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 26 ఫిక్స్డ్ టర్మ్ ఇంజినీర్ పోస్టులను భర్తీచేయనున్నారు.
* 26 ఖాళీల్లో భాగంగా సివిల్ (11), మెకానికల్ (08), ఎలక్ట్రికల్ (04), సీ అండ్ ఐ-ఈసీ (02), సీ అండ్ ఐ సీఎస్/ఐఎస్ (01) ఖాళీలను రిక్రూట్ చేస్తారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో ఇంజినీరింగ్ (బీఈ/బీటెక్/బీఎస్సీ) డిగ్రీని 60 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 29-07-2021 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికై అభ్యర్థులకు నెలకు రూ. 61,400 జీతంగా అందిస్తారు.
* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 09-07-2021న ప్రారంభమవుతుండగా 29-07-2021తో ముగియనుంది.
పూర్తి వివరాల కోసం ఈ లింకు https://npcilcareers.co.in/ క్లిక్ చెయ్యండి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల