అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

- July 02, 2021 , by Maagulf
అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

న్యూ ఢిల్లీ: కరోనా కేసులు అత్యధికంగా రిపోర్ట్ అయిన ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం హై-లెవల్ మల్టీ-డిసిప్లీనరీ పబ్లిక్ హెల్త్ టీమ్స్‌ను పంపించింది. కేరళ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురా, ఒడిశా, చత్తీస్‌గఢ్, మణిపూర్‌కు వెళ్లిన ఈ బృందాలు కరోనా నియంత్రణలో రాష్ట్రాలకు సాయం చేయనున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. ఆయా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ బృందాలు దృష్టిసారించి, అడ్డంకులను తొలగించడం ద్వారా కరోనా నియంత్రణ చర్యలను బలోపేతం చేస్తాయని తెలిపింది.

ముఖ్యంగా టెస్టింగ్‌, వ్యాక్సినేషన్‌తోపాటు ఆస్పత్రుల్లో పడకలు, వైద్య పరికరాలు సరిపడా ఉన్నాయా? లేదా? అని సమీక్షిస్తాయి. మొత్తంగా రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను పర్యవేక్షించి, పరిష్కార మార్గాలను చూపుతాయని కేంద్రం వివరించింది. కాగా, కేరళలో కొత్త కేసులు 12,868 నమోదవ్వగా, మొత్తం కేసులు 29,37,033కు చేరాయి. చత్తీస్‌గఢ్‌లో మొత్తం కేసులు 9,94,890కి పెరగగా, మణిపూర్‌లో 70,298, అరుణాచల్ ప్రదేశ్‌లో 36,168, త్రిపురాలో 66,629, ఒడిశాలో 9,12,887కు చేరాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com