'అన్నాత్తే' రిలీజ్ డేట్ వచ్చేసింది

- July 02, 2021 , by Maagulf
\'అన్నాత్తే\' రిలీజ్ డేట్ వచ్చేసింది

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అన్నాత్తే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న యూనిట్ రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించింది. దీపావళి సందర్భంగా నవంబర్ 14న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ జనరల్ చెకప్ నిమిత్తం ప్రత్యేక అనుమతులు తీసుకుని అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే. అమెరికా వెళ్ళకముందే రజినీకాంత్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే సీనియర్ నటి కుష్బూ, మీనా కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com