ఎంపిక చేయబడ్డ యాత్రీకులకు టెక్స్‌ట్ మెసేజ్‌లు: హజ్ మినిస్ట్రీ

- July 02, 2021 , by Maagulf
ఎంపిక చేయబడ్డ యాత్రీకులకు టెక్స్‌ట్ మెసేజ్‌లు: హజ్ మినిస్ట్రీ

రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రాహ్ - ఉమ్రా మరియు హజ్ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ హిషామ్ సయీద్ మాట్లాడుతూ, ఈ ఏడాది హజ్ యాత్ర కోసం అర్హత పొందిన యాత్రీకుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమయ్యిందని చెప్పారు. తొలి ఫేజ్‌లో 558,000 మంది డొమెస్టిక్ అప్లికెంట్స్ ఎలక్ట్రానిక్ పద్ధతిలో దరఖాస్తు చేసుకున్నారనీ, వీరిలో 51 శాతం మంది పురుషులు కాగా, 49 శాతం మంది మహిళలని తెలిపారు. పది రోజుల్లో ఈ అభ్యర్థనలను పరిశీలించడం జరిగిందని అన్నారు. అనుభవజ్ఞులైన యువతీ యువకులు ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. అర్హత పొందిన యాత్రీకులకు టెక్స్‌ట్ మెసేజ్ వెళుతుందని ఆయన పేర్కొన్నారు. యాత్రీకులు, అవసరమైన అన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారాయన.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com