ఎక్స్పో 2020: ఆయా దేశాల జాతీయ దినోత్సవ వేడుకలు వీక్షించే అవకాశం
- July 02, 2021
యూఏఈ: ఆరు నెలలపాటు జరిగే ఎక్స్పో 2020లో ఆయా దేశాలకు సంబంధించి జాతీయ దినోత్సవ వేడుకల్ని తిలకించే అవకాశం సందర్శకులకు కలగనుంది. అల్ వసల్ ప్లాజా ఈ వేడుకలకు వేదిక కానుంది. ఆయా దేశాలకు చెందిన జాతీయ పతాకాలు, జాతీయ గీతాలను ప్రదర్శించేందుకు అవకాశం వుంది. తమ తమ సాంస్కృతిక కార్యకలాపాలతో ఈ వేడుకలకు కొత్త శోభను అద్దనున్నారు ఆయా దేశాల ప్రతినిథులు. ఆయా జాతీయ దినోత్సవాల్ని నిర్వహించడానికి సాంకేతికంగా వీలుపడనివారు, హానర్ డే నిర్వహించుకునేందుకు వీలు పొందుతారు. ఒకే రోజు నేషనల్ డే, హానర్ డే వుంటే, ఉదయం ఒక వేడుక, సాయంత్రం ఇంకో వేడుక నిర్వహించుకోవచ్చు. 191 దేశాలకు చెందిన కళాకారులు ఈ ఎక్స్పోలో పాల్గొంటారు. క్రిస్మస్, న్యూ ఇయర్, దివాలీ, చైనా కొత్త సంవత్సర వేడుకలు.. ఇలా చాలా ప్రత్యేకమైన వేడుకలు ఈ ఎక్స్పోలో అలరించనున్నాయి.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







