ఖతార్ నుంచి భారత్ కు ఇండిగో ఫ్లైట్ సర్వీస్

- July 04, 2021 , by Maagulf
ఖతార్ నుంచి భారత్ కు ఇండిగో ఫ్లైట్ సర్వీస్

దోహా: ఖతార్ నుంచి ఏడు భారత నగరాలకు విమాన సర్వీసులను నడుపుతున్న ఇండిగో ఎయిర్ లైన్స్ లేటెస్ట్ గా మరో సిటీకి కూడా ఫ్లైట్ సర్వీస్ స్టార్ చేస్తోంది. దోహా నుంచి కోల్ కతాకు వారానికి ఓ విమాన సర్వీసును నడపున్నట్లు ఇండియన్ బడ్జెట్ ఎయిర్ లైన్స్ స్పష్టం చేసింది. ప్రతి వారం శుక్రవారం ఉదయం 5.20 గంటలకు కోల్ కతా నుంచి ఫ్లైట్ బయల్దేరుతుంది. 7 గంటలకు దోహా చేరుకుంటుంది. ఆ తర్వాత అదే రోజు ఉదయం 8 గంటలకు దోహా నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.25 గంటలకు కోల్ కతా చేరుకుంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎయిర్ లైన్ వెబ్ సైట్ లో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండిగో ఎయిర్ వేస్ ఖతార్ నుంచి ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోజికోడ్, కొచ్చి, కన్నుర్ కు ఫ్లైట్ సర్వీస్ నడుపుతోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com