ఫిలిప్పీన్స్‌లో కూలిన సైనిక విమానం...17 మంది మృతి
- July 04, 2021
మనీలా: ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 92 మంది ప్రయాణీకులతో వెళ్తున్న మిలటరీ విమానం ఆదివారం దక్షిణ ఫిలిప్పీన్స్‌లో కూలిపోయిందని ఆర్మీ చీఫ్ తెలిపారు.ఈ ఘటనలో మొత్తం 17 మంది చనిపోయారని మీడియా కథనాలు వెలువడుతున్నాయి.ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సి-130 విమానం కూలిన వెంటనే మంటలు అలుముకున్నాయని, దీని నుండి 40 మందిని రక్షించామని ఆర్మీ జనరల్ సిరిలిటో సోబెజానా తెలిపారు.సులు ప్రావిన్స్‌లోని జోలో ఐలాండ్‌లో విమానం దిగుతుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.సహాయక సిబ్బంది...సహాయ చర్యలు చేపడుతున్నారని, మరి కొంత మందిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రయాణీకుల్లో ఎక్కువ మంది ప్రాథమిక మిలటరీ ట్రైనింగ్ పూర్తి చేశారని, ఉగ్రవాదంపై పోరాడే ఉమ్మడి టాస్క్ పోర్స్‌లో భాగంగా వారిని ఆ ఐలాండ్‌లో మోహరించేందుకు తీసుకెళుతున్నారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







