ఆగస్ట్ 31 వరకు కోవిడ్ సెఫ్టీ ప్రోటోకాల్ పొడిగింపు
- July 05, 2021
యూఏఈ: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు చేపడుతున్న కోవిడ్ నిబంధనలను ఆగస్ట్ 31 వరకు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు రస్ అల్ ఖైమా వెల్లడించింది. వచ్చే నెలాఖరు వరకు ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాలే అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. పబ్లిక్ ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు, స్పోర్ట్స్, సంస్కృతిక కార్యక్రమాలు ఇతర ప్రభుత్వ అనుమతి పొందిన ఈవెంట్లకు హజరయ్యేవారు ఖచ్చితంగా వ్యాక్సిన్ పొంది ఉండాలని తెలిపింది. వ్యాక్సిన్ సర్టిఫికేషన్ తో పాటు ఈవెంట్ కు 48 గంటల్లోపు తీసుకున్న పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ ను అదనంగా చూపించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోకపోయినా, పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ లేకపోయినా ఈవెంట్లకు ప్రవేశం ఉండదని వెల్లడించింది. అల్ హోస్న్ యాప్ ద్వారా వ్యాక్సిన్ సర్టిఫికేషన్ ను అధికారులకు చూపించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







