హజ్ పర్మిట్ లేకుండా పవిత్ర స్థలాల్లోకి ఎంటరైతే SR 10,000 ఫైన్
- July 05, 2021
సౌదీ: హజ్ యాత్రికులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని తగిన అనుమతులు పొందిన తర్వాతే పవిత్ర ప్రార్ధనా స్థలానికి రావాలని అధికారులు సూచించారు. ఎవరైనా సరైన అనుమతులు లేకుండా పవిత్ర స్థలాలైన మినా, ముజ్దలిఫా, అరాఫత్ లోకి ప్రవేశిస్తే SR 10,000 జరిమానా తప్పదని హెచ్చరించారు. ఒకవేళ అదే తప్పును రెండో సారి రిపీట్ చేస్తే జరిమానా రెట్టింపు అవుతుందని అన్నారు. జులై 18 నుంచి హజ్ యాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ ప్రోటోకాల్ ను ఖచ్చితంగా అమలు చేసే లక్ష్యంతో అధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. జులై 5 నుంచే పవిత్ర స్థలాల్లో కోవిడ్ ప్రోటోకాల్ ను అమలు చేస్తున్నామన్నారు. హజ్ యాత్రకు 13 రోజులు ఉండగా ఇప్పటి నుంచే హజ్ పర్మిట్ లేని వారికి అనుమతి నిషేధిస్తున్నట్లు భక్తులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. హజ్ పర్మిట్ లేని వారిని అడ్డుకునేందుకు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని, పవిత్ర మసీదులకు వెళ్లే అన్ని రహదారుల్లో దారిపోడవునా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







