కరోనా ఇంకా వెళ్లిపోలేదు..అమెరికా అధ్యక్షుడు
- July 05, 2021
వాషింగ్టన్:అమెరికా అధ్యక్షడు జో బైడెన్ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల నేపథ్యంలో వైట్‌హౌజ్ కార్యక్రమంలో మాట్లాడారు. కరోనాపై యుద్ధం ముగియలేదని, ఆ మహమ్మారిపై సంపూర్ణ విజయం సాధించాల్సి ఉందన్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించడంలో అమెరికా పైచేయి సాధించిందని, కానీ ఆ మహమ్మారితో జాగ్రత్తగా ఉండాలని, అది ఇంకా వెళ్లిపోలేదన్నారు.
వైట్‌హౌజ్‌లో అతిథులతో మాట్లాడుతూ.. డెల్లా వేరియంట్ లాంటి శక్తివంతమైన వేరియంట్లు మళ్లీ విరుచుకుపడుతున్నాయన్నారు. కరోనా వల్ల అమెరికాలో సుమారు ఆరు లక్షల మంది మరణించిన విషయం తెలిసిందే.1776లో బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్య్రం పొందిన అమెరికాను..ప్రస్తుతం కరోనా వైరస్ నుంచి విముక్తి పొందిన ఘటనలను పోల్చుతూ బైడెన్ మాట్లాడారు.కరోనాతో మృతిచెందిన అమెరికన్లకు ఆయన నివాళి అర్పించారు. గత ఏడాది కాలం నుంచి మనం చాలా వరకు చీకటి రోజుల్ని గడిపినట్లు ఆయన చెప్పారు. ఇక దివ్యమైన భవిష్యత్తును చూస్తామన్నారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







