ఏపీ కరోనా అప్డేట్
- July 05, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 72,731 సాంపిల్స్ పరీక్షించగా..2,100 మందికి పాజిటివ్‌గా తేలింది.మరో 21 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు.తాజా మృతుల్లో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, తూర్పు గోదావరిలో నలుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, అనంతపూర్, గుంటూరు, నెల్లూరులో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, విశాఖపట్నం,పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు ఉన్నారు.ఇక, ఇదే సమయంలో 3,435 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,05,023కి పెరగగా..కోలుకున్నవారి సంఖ్య 18,58,189కి చేరింది.ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 12,870 మంది మృతి చెందితే.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 33,964 యాక్టివ్ కేసులు ఉన్నాయని..నేటి వరకు 2,24,35,809 సాంపిల్స్ పరీక్షించామని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







