ఏపీ ముఖ్యమంత్రితో అనిల్‌కుంబ్లే భేటీ
- July 05, 2021
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్.జగన్‌ను సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రఖ్యాత క్రికెటర్, భారత టెస్టు జట్టు మాజీ కెప్టెన్ అనిల్‌కుంబ్లే కలుసుకున్నారు. ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇదే సమయంలో ఇరువురి మధ్య క్రీడల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చాయి.ఏపీలో స్పోర్ట్స్ యూనివర్శిటీ పెడితే తన వంతు సహకారం అందిస్తానని కుంబ్లే సీఎంకు చెప్పారు. అంతేకాక క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీని పెట్టే అంశంపైనా దృష్టిసారించాలని ఆయన సీఎంను కోరారు. ప్రస్తుతం జలంధర్, మీరట్ లాంటి నగరాలనుంచే అన్నిరకాల క్రీడా సామగ్రిని తెచ్చుకుంటామని, ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే అందరికీ అందుబాటులో క్రీడా సామగ్రి ఉంటుందని ఆయన సీఎంకు వివరించారు. దీనికి సంబంధించి తన అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నానని కుంబ్లే చెప్పారు.

తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







