మహిళా వర్కర్‌తో కలిసి ఫ్లై ఓవర్ ప్రారంభించిన కేటీఆర్
- July 06, 2021
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం బాలానగర్ చౌరస్తాలో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు.ఈ ఫ్లై ఓవర్ 1.13 కిలోమీటర్ల దూరం..24 మీటర్ల వెడల్పుతో రూ. 387 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని ఆరు లేన్లతో నిర్మించారు. వంతెనపై బీటీరోడ్డు వేయడంతో పాటు మధ్యలో డివైడర్ సైతం ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ వీధిలైట్లు అమర్చారు.ఈ వంతెనతో ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాదు..ఈ ప్రాంతం మీదుగా సికింద్రాబాద్-కూకట్పల్లి-అమీర్‌పేట-జీడిమెట్ల వైపునకు రాకపోకలు సాగించే వారికి వెసులుబాటు కలుగుతుంది.
ఫ్లైఓవర్ ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కూకట్పల్లి-సికింద్రాబాద్ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. త్వరలో రహదారుల విస్తరణ చేపడతామన్నారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మిస్తామని తెలిపారు. ఫతేనగర్ ఫ్లైఓవర్‌ను విస్తరిస్తామని కేటీఆర్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి,ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్,ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌కు బోనాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







