8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- July 06, 2021
న్యూఢిల్లీ: 8 మంది కొత్త గవర్నర్ పేర్లను కేంద్రం ప్రకటించింది. మిజోరాం గవర్నర్‌గా విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. హిమాచల్ నుంచి హర్యానాకు దత్తాత్రేయ బదిలీ అయ్యారు. కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్ గెహ్లాట్(ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు), గోవా గవర్నర్‌గా శ్రీధరన్ పిళ్లై (మిజోరాం ప్రస్తుత గవర్నర్), హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా రాజేంద్రన్ విశ్వనాథ్‌ను కేంద్రం ప్రకటించింది.
మధ్యప్రదేశ్ గవర్నర్‌గా మంగూబాయి చగన్‌భాయ్ పటేల్, త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, జార్ఖండ్ గవర్నర్‌గా రమేష్ బయాస్ నియమితులయ్యారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు ముందే కేంద్రం.. గవర్నర్ల నియామకాలను జరిపింది. రేపు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







