ఇండియాలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

- July 07, 2021 , by Maagulf
ఇండియాలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టినట్లుగా కనిపించినా, నేడు మరోసారి కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. భారత్‌లో నిన్న 111 రోజుల కనిష్ట కరోనా కేసులు నమోదుకాగా, నిన్నటితో పోల్చితే నేడు 9వేల కేసులు అధికంగా నమోదయ్యాయి. డెల్టా మరియు డెల్టా ప్లస్ కరోనా కేసులపై ఆందోళన అక్కర్లేదని, కోవిడ్19 నిబంధనలు పాటిస్తే సరి అని నిపుణులు సూచిస్తున్నారు.

ఇండియాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం (జులై 7న) ఉదయం 8 గంటల వరకు 19 లక్షల 7 వేల 216 శాంపిల్స్‌కు నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 43,733 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపితే దేశంలో ఇప్పటివరకూ మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,06,63,665కు (30 కోట్ల 6 లక్షల 63 వేల 665)కు చేరుకుంది. నిన్నటితో పోల్చితే కరోనా కేసులతో పాటు కోవిడ్19 (COVID-19 Delta Variant) మరణాలు భారీగా పెరిగాయి. అదే సమయంలో మరో 930 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు.  దేశంలో మొత్తం కోవిడ్19 మరణాలు 4,04,211 (4 లక్షల 4 వేల 211)కు చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 

గడిచిన 24 గంటల వ్యవధిలో చికిత్స అనంతరం దేశవ్యాప్తంగా మరో 47,240 మంది కరోనా మహమ్మారిని జయించారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకూ 2,97,99,534 (2 కోట్ల 97 లక్షల 99 వేల 534) మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ఇండియాలో ప్రస్తుతం 4,59,920 (4 లక్షల 59 వేల 920) యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. భారత్‌లో ఇప్పటివరకూ 36 కోట్ల 13 లక్షల 23 వేల 548 డోసుల కరోనా వ్యాక్సినేషన్ (COVID-19 Vaccine) ప్రక్రియ పూర్తయింది. గత ఏడాది నుంచి దేశంలో 42 కోట్ల 33 లక్షల 32 వేల 97 శాంపిల్స్‌కు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ ఓ ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com