యూఏఈ గోల్డెన్ వీసా: 24 x 7 సర్వీసు దుబాయ్‌లో ప్రారంభం
- July 07, 2021
యూఏఈ: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) దుబాయ్, 24 x 7 యూ ఆర్ స్పెషల్ సేవను ప్రారంభించింది. ఇరవై నాలుగు గంటలూ ఈ సేవలు వినియోగదారులకు అందుబాటులో వుంటాయి. 10,000 మందికిపైగా స్పాన్సర్డ్ ఎంప్లాయీస్ కలిగిన సంస్థలు, గోల్డెన్ వీసాలు కలిగిన ఓనర్స్, 4 నుంచి 5 స్టార్ హోటల్స్, లగ్జరీ హోటల్ అపార్టుమెంట్లు మరియు జిడిఆర్ఎఫ్ఎ వ్యూహాత్మక భాగస్వాముల కోసం ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా వుంటాయి. ఖచ్చితమైన టైమ్ ఫ్రేమ ప్రకారం లావాదేవీలు పూర్తవుతాయి ఈ విధానం ద్వారా. డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిడిఎఫ్ఆర్ఎ మేజర్ జనరల్ మొహమ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ ‘యూ ఆర్ స్పెషల్’ సేవ, దుబాయ్ రూలర్ అలాగే యూఏఈ వైస్ ప్రెసిడెంట్ అలాగే ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సూచనల మేరకు ఈ సేవను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







