24 దేశాల నుంచి విమానాలను రద్దు చేసిన ఒమన్

- July 08, 2021 , by Maagulf
24 దేశాల నుంచి విమానాలను రద్దు చేసిన ఒమన్

ఒమన్: ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు యూకే తదితర 24 దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులతో కూడిన విమానాల్ని రద్దు చేసింది ఒమన్. తదుపరి నోటీసు వరకు ఈ నిషేధం అమల్లో వుంటుంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒమన్, ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ట్యునీసియా, లెబనాన్, బ్రూనై, ఇండోనేషియా, ఇతియోపియా, ఇరాన్, అర్జెంటీనా, బ్రెజిల్, సుడాన్, ఇరాక్, ఫిలిప్పీన్స్, టాంజానియా, సౌతాఫ్రికా, సింగపూర్, ఘనా, సియెర్రాలియోన్, గునియా, కొలంబియా, నైజీరియా మరియు లిబియా దేశాలు ఈ నిషేధిత దేశాల జాబితాలో వున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com