హోటల్స్ కు గ్రీన్ సిగ్నల్..ఇన్ హౌజ్ అతిథులకు మాత్రమే!

- July 09, 2021 , by Maagulf
హోటల్స్ కు గ్రీన్ సిగ్నల్..ఇన్ హౌజ్ అతిథులకు మాత్రమే!

మస్కట్: ఒమన్ ప్రభుత్వం హోటల్స్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..హోటల్ లో బస చేసే అతిథులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు షరతు విధించింది. బయటి వ్యక్తులను అనుమతించొద్దని స్పష్టం చేసింది. అది కూడా హోటల్ కేపాసిటీలో 50 శాతం మందికి మించి ఉండకూడదు. కోవిడ్ నేపథ్యంలో పూర్తి జాగ్రత్త చర్యలు పాటిస్తూ హోటళ్లను నిర్వహించాలని పేర్కొంది. దోఫర్ గవర్నరేట్ లోని హోటళ్లు, పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని సంస్థల్లో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ వెసులుబాటు అమలుకానుంది. ముసందం గవర్నరేట్లోని హోటళ్లు టూరిస్ట్ ఎస్టాబ్లిష్మెంట్లకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com