వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో ఆస్ట్రా జెనకా పేరుని ఆక్స్ఫర్డ్ పేరుకి జోడించిన MOH
- July 09, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ విషయమై ఓ మార్పు చేయడం జరిగింది. ఆక్స్ఫర్డ్ పేరుకి అదనంగా ఆస్ట్రాజెనకా పేరుని జోడించింది వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో. పౌరులు అలాగే రెసిడెంట్స్ ఎవరైనా సర్టిఫికెట్‌ని ఇకపై కొత్తగా మార్చుకోవడానికి కూడా వీలు కల్పిస్తున్నారు. వ్యాక్సిన్ పొందినవారు సంబంధిత లింక్ ద్వారా, కొత్త సర్టిఫికెట్, జోడించిన పేరుతో పొందవచ్చు. ఇప్పటిదాకా ఆక్స్ఫర్డ్ అనే వున్న సర్టిఫికెట్లో ఇకపై ఆస్ట్రాజెనకా అనే పేరు అదనంగా కనిపిస్తుంది. యూరోపియన్ యూనియన్ కోవిడ్ వ్యాక్సినేషన్ పాస్‌పోర్టు, అనుమతి పొందిన నలుగు వ్యాక్సిన్లను మాత్రమే యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ ద్వారా ఆమోదింపబడుతున్న దరిమిలా ఈ మార్పులు చేయాల్సి వచ్చింది. కోమిర్నటీ (బయో ఎన్ టెక్, ఫైజర్), మోడెర్నా, వాక్స్జెవెరా (కోవిడ్ 19 వ్యాక్సిన్ ఆస్ట్రా జెనకా, ఆక్స్ఫర్డ్), జాన్సెన్ (జాన్సన్ అండ్ జాన్సన్) వ్యాక్సిన్లకు యూరోపియన్ యూనియన్ అనుమతిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్‌లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి
- బ్లాక్ సిలో నౌక పై దాడి..భారతీయుడు దుర్మరణం
- విద్యార్థుల కేసు విచారణపై స్పష్టత ఇచ్చిన సీజేఐ సూర్యకాంత్!
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక







