ఒమన్-సౌదీ సమన్వయ మండలి ఏర్పాటుకు MOU

- July 12, 2021 , by Maagulf
ఒమన్-సౌదీ సమన్వయ మండలి ఏర్పాటుకు MOU

సౌదీ: పరస్పర ప్రయోజనాలు, అభివృద్ధి లక్ష్యంగా ఒమన్-సౌదీ సమన్వయ మండలి(కోఆర్డినేషన్ కౌన్సిల్) ఏర్పాటు చేస్తూ ఇరు దేశాలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్-సౌద్, ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది, సౌదీ ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్-సౌద్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం మేరకు రెండు దేశాల మధ్య సమైక్యతను మరింత బలోపేతం చేయటంతో పాటు ఇప్పటికే చేపట్టిన జాయింట్ ప్రాజెక్టులను ఈ సమన్వయ మండలి ప్రమోట్ చేయనుంది. అంతేకాదు రెండు దేశాల ప్రయోజనాలు చేకూర్చేలా సమన్వయ మండలి ఆధ్వర్యంలో మరిన్ని ఒప్పందాలకు అవకాశాలుంటాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com