వ్యాక్సినేషన్ సెంటర్కి కాలినడకన, బైక్ మీద వచ్చే వారికి నో ఎంట్రీ
- July 12, 2021
ఖతార్: పారిశ్రామిక రంగం, వ్యాపార రంగాల్లోని సిబ్బందికి వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించినట్లు ఖతార్ వెల్లడించింది. ఇవాళ్టి (జులై 12) నుంచి వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభం అవుతోంది. ప్రపంచంలోని అతి పెద్ద వ్యాక్సినేషన్ సెంటర్లలో ఇదీ కూడా ఒక్కటి. ప్రతిరోజు 25 వేల మందికి వ్యాక్సిన్ అందించవచ్చు. అయితే..ఈ వ్యాక్సిన్ సెంటర్ కు వచ్చే వారు కాలినడకన, బైక్ ల మీద రావొద్దని వ్యాక్సినేషన్ సెంటర్ నిర్వాహకులు సూచించారు. కాలినడకన, బైక్ ల మీద వచ్చే వారికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. వీకెండ్లో వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కంపెనీలు తమ సిబ్బందికి వ్యాక్సిన్ షెడ్యూల్ ఖారారు చేసేందుకు [email protected] కు మెయిల్ చేయాలని కోరారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







