సాయంత్రపు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం

- July 13, 2021 , by Maagulf
సాయంత్రపు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం

మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈవినింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. 2021-22 సంవత్సరానికిగాను ప్రీ-సెకెండరీ విభాగాల కోసం ఈ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జులై 13 నుంచి ఆగస్ట్ 13 వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 15 ఏళ్ళ వయసు పైబడినవారికి ఆన్‌లైన్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ కల్పిస్తారు. సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాల్సి వుంటుంది. గత ఏడాది రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ఆటోమేటిక్‌గా ఈ ఏడాది రిజిస్ట్రేషన్ అయిపోతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com