దేశ సేవలో రెడ్ క్రాస్ ఎంతో కీలకం:టి.గవర్నర్
- July 14, 2021
హైదరాబాద్: దేశ సేవలోనూ జాతి సేవలో రెడ్ క్రాస్ చేస్తున్నసేవలు గర్వించదగ్గవని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కొనియాడారు.రెడ్ క్రాస్ నిజామాబాద్ జిల్లా చైర్మన్ డాక్టర్ నీలి రామచందర్ కు ఈరోజు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ 'ప్రెసిడెంట్ అఫ్ ఇండియా గోల్డ్ మెడల్, ' సర్టిఫికెట్ ను అందజేశారు.రెడ్ క్రాస్ ద్వారా డాక్టర్ నీలి రామచందర్ చేసిన సేవలకు గుర్తింపుగా 2017-18 సంవత్సరానికి గాను ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గోల్డ్ మెడల్ కు ఎంపికయ్యారు. కోవిడ్, లాక్‌డౌన్ పరిస్థితుల వలన ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం వల్ల గవర్నర్ చేతుల మీదుగా ఆయనకు ఈ గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ ను రాజ్ భవన్ లో బుధవారం అందించారు.దేశ ప్రజల సేవలో, జాతి సేవలో రెడ్ క్రాస్ నిరుపమానమైన సేవలందిస్తున్న దని గవర్నర్ కొనియాడారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ అఫ్ ఇండియా గోల్డ్ మెడల్ రావడం రాష్ట్రానికి ఇదే తొలిసారి.ఈ ఘనత సాధించిన డాక్టర్ రామ్ చందర్ ను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు.తెలంగాణ రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతం చేయాలని ఈ సందర్భంగా డాక్టర్ తమిళిసై పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గవర్నర్ సెక్రెటరీ కె సురేంద్రమోహన్, రెడ్ క్రాస్ రాష్ట్ర ప్రతినిధులు మదన్ మోహన్ రావు, డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి, ఈ వి శ్రీనివాసరావు, రెడ్ క్రాస్ నిజామాబాద్ ప్రతినిధులు బుస్సా ఆంజనేయులు, తోట రాజశేఖర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







