కరోనా వైరస్ హెల్త్ స్టేటస్ స్కామ్: 122 మందిపై కేసులు
- July 15, 2021రియాద్: సౌదీ అరేబియా యాంటీ కరప్షన్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, కరోనా వైరస్ హెల్త్ స్టేటస్ (పౌరులకు అలాగే నివాసితులకు) అక్రమంగా మార్చే క్రమంలో 122 మంది భాగస్వామ్యం వున్నట్లు తెలుస్తోంది. ఓవర్‌సైట్ మరియు యాంటీ కరప్షన్ విభాగం 12 మందిని అరెస్ట్ చేసినట్లు ఇప్పటికే వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా నిందితులు, ఈ నేరానికి పాల్పడే క్రమంలో ప్రకటనలు ఇచ్చారని అధికారులు తెలిపారు. విచారణ తర్వాత మొత్తం 122 మంది ఈ కుట్రలో భాగం పొందారని గుర్తించినట్లు అధికారులు వివరించారు. 122 మందిలో 9 మంది (ఏడుగురు పురుషులు, ఇద్దరు మహిళలు) హెల్త్ మినిస్ట్రీ ఉద్యోగులు కాగా, 21 మంది (ెనిమిది మంది పురుష పౌరులు, ఒక మహిళా పౌరురాలు 12 మంది వలసదారులు) ఫెసిలిటేటర్స్‌గా వ్యవహరించారు. 92 మంది లబ్దిదారులున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?