బహ్రెయిన్‌లో BD22 మిలియన్ విలువైన మున్సిపల్ ప్రాజెక్టులు
- July 15, 2021
బహ్రెయిన్: ప్రజల జీవన ప్రమాణాలు పెంచటమే లక్ష్యంగా కింగ్డమ్ వ్యాప్తంగా గవర్నరేట్లలో BD22 మిలియన్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టినట్లు బహ్రెయిన్ వెల్లడించింది. జనాభా ప్రాతిపదికన మున్సిపాలిటీ అవసరాలకు అనుగుణంగా మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించింది. వీక్లీ మీటింగ్ లో మౌళికా సదుపాయాల అభివృద్ధి పనుల కోసం ఏర్పాటైన మంత్రుల కమిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. సమావేశంలో భాగంగా 2021-2022 వార్షిక సంవత్సరానికిగాను పలు మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులను పట్టణ ప్రణాళిక, మున్సిపాలిటీ వ్యవహారాలు, పనుల మంత్రిత్వ శాఖ మంత్రుల కమిటీకి వివరించింది. ప్రభుత్వ పరిధిలో చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులు వచ్చే ఏడాది నాటికి కొలిక్కి వస్తాయని తెలిపింది. ఇప్పటి వరకు ప్రారంభమైన, టెండర్ దశలో ఉన్న ప్రాజెక్టులు 65 శాతం మేర ఉన్నాయని, మరో 23 శాతం ప్రాజెక్టులు డిజైన్ దశలో ఉండగా..మిగిలిన ప్రాజెక్టులు అధ్యాయన దశలో ఉన్నాయని మంత్రుల కమిటీకి వివరించింది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







