సానియా మిర్జా, షోయబ్ మాలిక్ కు గోల్డెన్ వీసా

- July 15, 2021 , by Maagulf
సానియా మిర్జా, షోయబ్ మాలిక్ కు గోల్డెన్ వీసా

యూఏఈ: ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు యూఏఈ పదేళ్ల గోల్డెన్ వీసాను మంజూరు చేసింది. దేశంలోని వివిధ రంగాల్లో విశేష సేవలు అందించే వారికి, ప్రముఖ వ్యాపారులకు, సాంకేతిక నిపుణులకు మాత్రమే గోల్డెన్ వీసాలను జారీ చేస్తారు. పదేళ్లు, ఐదేళ్లు గడువు ఉన్న దీర్ఘకాల వీసాలను 2019 నుంచి యూఏఈ మంజూరు చేస్తూ వస్తోంది. పాక్-భారత్ జంట షోయబ్, సానియా మిర్జాను కూడా గోల్డెన్ వీసాతో యూఏఈ గౌరవించింది. ఇండియన్ టెన్నిస్ కు ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన సానియా మిర్జా ప్రస్తుతం లండన్లో జరుగుతున్న వింబుల్డన్ టోర్నీలో పాల్గొంటున్నారు. విమెన్ డబుల్స్ లో సెకండ్ రౌండ్ చేరుకోగా, రోహన్ బొపన్నతో కలిసి మిక్స్ డ్ డబుల్స్ లో థార్డ్ రౌండ్ కి చేరుకున్నారు సానియా. ఇక పాక్ మాజీ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ 35 టెస్టులు, 287 వన్డే మ్యాచ్లు, 116 టీ-ట్వంటీ మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com