టోక్యో ఒలింపిక్స్: కరోనా కలకలం.. విలేజ్‌లో తొలి పాజిటివ్ కేసు
- July 17, 2021
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌కు వైరస్ గండం పొంచి ఉన్నట్లే కనిపిస్తోంది. మరో ఆరు రోజుల్లో క్రీడా సంబరం ప్రారంభం అవుతుండగా... ఒలింపిక్స్ విలేజ్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తుండగా... ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు... క్రీడల నిర్వాహక కమిటీ ప్రతినిధులు ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా అతని పేరు, ఇతర వివరాలు బయటపెట్టలేదు. అయితే అతను స్థానికుడు కాదని.. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి అని తెలుస్తోంది. దీంతో అతణ్ని విలేజ్ నుంచి బయటకు తీసుకొచ్చి... ఓ హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.
ఈ నెల 23 నుంచి టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. దీని కోసం ఈ నెల 13 వ తేదీనే క్రీడా గ్రామాన్ని తెరిచారు. ఇప్పటికే వేలాది మంది అథ్లెట్లు, అధికారులు ఈ గ్రామానికి చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇంత చేస్తున్నా... కరోనా కేసు బయటపడడం ఒలింపిక్స్ నిర్వాహకులను కలవరపాటుకు గురిచేసింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







