విమాన సర్వీసులపై ఎతిహాద్ ఎయిర్లైన్స్ కీలక ప్రకటన!
- July 17, 2021
యూఏఈ: యూఏఈ నేషనల్ క్యారియర్ ఎతిహాద్ ఎయిర్‌వేస్ భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ విమాన సర్వీసులపై తాజాగా కీలక ప్రకటన చేసింది.ఈ మూడు దేశాల విమాన సర్వీసులను జూలై 31 వరకు సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.యూఏఈ అథారిటీస్ భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విమానాలను ఈ నెల 31 వరకు పూర్తిగా రద్దు చేసినట్లు ఎతిహాద్ పేర్కొంది. కనుక ఆయా దేశాలకు చెందిన ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిపెట్టుకుని విమాన టికెట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించింది. ఇక ఇప్పటికే టికెట్ బుకింగ్ చేసుకున్న వారు భారీ సంఖ్యలో తమ కాంటాక్ట్ సెంటర్, సోషల్ మీడియా బృందాన్ని సంప్రదిస్తున్నారని, బుకింగ్ విషయంలో నేరుగా తమను కాంటాక్ట్ చేయొద్దని కోరింది.

అసీఫ్ అనే ప్రయాణికుడి ట్వీట్‌కు స్పందించిన ఎతిహాద్..అతడికి కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. జూలై 31 వరకు భారత్ నుంచి యూఏఈకి విమాన సర్వీసులు పూర్తి నిలిపివేసినట్లు వెల్లడించింది. ఇతర వివరాల కోసం ఎతిహాద్ అధికారిక వెబ్‌సైట్ https://t.co/hWA7ZGfiaFలో చూడాలని తెలిపింది. ఇదిలా ఉంటే..యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(GCAA) మాత్రం ఇప్పటివరకు భారత్‌కు విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







