పవిత్ర స్థలాల్లో మొబైల్ ఫీల్డ్ ఆస్పత్రులు ఏర్పాటు
- July 19, 2021
సౌదీ: హజ్ యాత్ర నేపథ్యంలో పవిత్ర స్థలాలలో యాత్రికులకు సేవ చేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మొబైల్ ఫీల్డ్ ఆసుపత్రిని సిద్ధం చేసింది. అరాఫత్ ప్రాంతం, నమీరా మసీదుకు ఉత్తర ప్రాంతంతో పాటు అవసరమైన ఇతర ప్రాంతాలలో వైద్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మొబైల్ ఫీల్డ్ ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు, కన్సల్టెంట్ల బృందం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లోనూ పేషెంట్లకు వైద్యం అందించేలా మొత్తం 11 పడకలతో ఏర్పాట్లు ఉన్నాయి. వాటిలో రెండు ఇంటెన్సివ్ కేర్, నాలుగు ఇన్ పేషెంట్ కేర్, ఐదు మెడికల్ కేర్ పడకలుగా కేటాయించారు. అలాగే ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సరిపడా వెంటిలేటర్లు, డీఫిబ్రిలేటర్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు







