పెరిగిన IBPS ఆర్ఆర్బీ పోస్టులు..
- July 19, 2021
ఐబీపిఎస్ ఆర్ఆర్బీ స్కేల్ 1 పోస్టుల సంఖ్యను పెంచింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ముందుగా 4,257 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఆ సంఖ్యను 4,716కు పెంచినట్లు తెలిపింది. ఇందు కోసం నిర్వహిస్తున్న ఎగ్జామ్స్ కు తాజాగా అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించనున్నది.
ఐబీపీఎస్ ఆర్ ఆర్ బీ పీఓ అడ్మిట్ కార్డులను ఈ కింది విధంగా డౌన్ లోడ్ చేసుకోవాలి.
తొలుత అధికారిక వెబ్ http://www.ibps.in లోకి వెళ్లాలి. తరువాత హోంపేజ్ ఓపెన్ అయిన తరువాత స్క్రోలింగ్ అవుతున్న లింక్ పై క్లిక్ చేస్తే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వాలి. అడ్మిట్ కార్డు ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకోవాలి.
అభ్యర్థులు ఎగ్జామ్స్ హాలుకు అడ్మిట్ కార్డు సహా ఒక ఐడీ ఫ్రూఫ్ తప్పనిసరిగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఐబీపీఎస్ ఆర్ ఆర్ బీ ప్లిలిమ్స్ ఎగ్జామ్స్ కు ఉత్తీర్ణులైన వారు సెప్టెంబర్ లో మెయిన్స్ పరీక్షకు హజరుకావాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూలో అర్హత సాధించాలి. ఈ ఉద్యోగ అర్హత సాధించిన వారికి నెలకు వేతనంగా రూ.30 వేల నుండి రూ.35వేల వరకూ ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







