ఏపీ కరోనా అప్డేట్

- July 19, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే..ఆ కేసుల సంఖ్య ఇవాళ కాస్త తగ్గింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1628 మంది పాజిటివ్‌గా నమోదు కాగా… మరో 22 మంది కరోనా బాధితులు మృతి చెందారు.. ఇదే సమయంలో.. 2744 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.

మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,38,829 కు చేరుకోగా..రికవరీ కేసులు 19,02,105 కు పెరిగాయి.ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి 13,154 మంది మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 24,708 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 71,152 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com