'నారప్ప' మూవీ రివ్యూ

- July 20, 2021 , by Maagulf
\'నారప్ప\' మూవీ రివ్యూ

నటీనటులు: వెంకటేష్, ప్రియమణి, రాజీవ్ కనకాల, నాజర్, రావు రమేష్ తదితరులు..

ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్


సంగీతం: మణిశర్మ

నిర్మాతలు: సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను

దర్శకుడు: శ్రీకాంత్ అడ్డాల

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. తమిళంలో ధనుశ్ హీరోగా తెరకెక్కిన ‘అసురన్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్స్‌లో కాకుండా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌పామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ 

స్టోరీ విషయానికొస్తే.. నారప్ప (వెంకటేష్), సుందరమ్మ (ప్రియమణి) ఓ ఊరిలో వాళ్లకున్న మూడు ఎకరాల పొలం పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. వీళ్లకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంటారు. ఇక నారప్ప పెద్ద కుమారుడికి కాస్త ఆవేశం పాలు ఎక్కువ. ఆ ఊరిలో సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఆ ఊరి పెద్ద నారప్ప పొలం అడుగుతాడు. ఆ పొలాన్ని నమ్ముకుని బతుకుతూ ఉండే నారప్ప కుటుంబం .. ఆ పొలాన్ని ఇచ్చేది లేదంటారు.  ఈ క్రమంలో నారప్ప పెద్ద కుమారుడికి, ఊరి పెద్ద కుటుంబ సభ్యులకు పెద్ద గొడవ అవుతోంది. ఈ క్రమంలో  ఊరి పెద్ద కుటుంబ సభ్యులు.. నారప్ప పెద్ద కుమారుడిని  చంపేస్తారు.  దీంతో నారప్ప తన కుమారుడిని చంపిని వాళ్లపై ఎలా పగ తీర్చుకున్నాడనేదే నారప్ప మూవీ స్టోరీ.

కథనం.. 

కథనం విషయానికొస్తే.. తమిళంలో ధనుశ్ హీరోగా చేసిన ‘అసురన్’ సినిమా చూడని వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది. కానీ చూసిన వాళ్లకు మాత్రం ‘నారప్ప’ సినిమా చూస్తుంటే.. కాపీ పేస్ట్ సినిమాలా కనిపిస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను తెలుగు నేటివిటీతో కాకుండా అచ్చం తమిళ సినిమాను యథావిధిగా దింపేసారు. మరోవైపు వెంకటేష్‌తో తనదైన నటన రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. రీమేక్ అంటే తెలుగు నేటివిటీతో పాటు ఇక్కడ హీరో ఇమేజ్‌కు తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు అవసరం కానీ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా స్టోరీని ఏ మాత్రం మార్చిన ఈ  సినిమా కథలోని ఆత్మ దెబ్బ తింటుందని యథావిధిగా తెలుగు ప్రేక్షకులకు అందించారు. సెకండాఫ్‌లో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు. కొన్ని సన్నివేశాలను తమిళ్‌లో కంటే బెటర్‌గా తీయవచ్చు కానీ.. శ్రీకాంత్ అడ్డాల ’అసురన్’ ఒక్క మార్పు చేయకుండా తెరకెక్కించారు.  తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా చూస్తుంటే.. రంగస్థలం గుర్తుకు వస్తుంది.  మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్‌ బాగుంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

నటీనటుల విషయానికొస్తే.. 

వెంకటేష్‌కు ఇలాంటి రీమేక్ కథలు చేసి ఎన్నో సక్సెస్‌లు అందుకున్నారు. గతంలో ఎన్ని రీమేక్ సినిమాలు చేసినా.. సామాన్య ప్రేక్షకులకు తెలిసేది కాదు. ఇపుడు టెక్నాలజీ పుణ్యామా అందరికీ తెలిసిపోతుంది. ఇక నారప్పగా వెంకటేష్ తన పాత్ర పరిధి మేరకు అద్భుతంగా నటించారు. కథ ప్రకారం సినిమా మొత్తం డీ గ్లామర్‌గా కనిపించారు. ఫ్లాష్‌బ్యాక్‌లో మాత్రం తన రెగ్యులర్ వేషంలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా కుమారుడు చనిపోయే సన్నివేశంలో వెంకటేష్ జీవించారనే చెప్పాలి. సినిమా మొత్తం తన భుజాలపై వేసుకుని నడిపించారు. ఇక నారప్ప భార్యగా నటించిన ప్రియమణి తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. వెంకటేష్ బామ్మర్ధిగా నటించిన రాజీవ్ కనకాల తన పరిధి మేరకు అద్భుతంగా నటించారు. నాజర్, రావు రమేష్ తో మిగతా నటీనటులు తమ పరిధి మేరకు అద్భుతంగా నటించారు.

ప్లస్ పాయింట్స్.. 

కథ

వెంకటేష్‌తో పాటు నటీనటుల నటన

మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ 

తేలిపోయిన పతాక సన్నివేశం
నిదానంగా సాగే ద్వితీయార్ధం

చివరి మాట.. నారప్ప ఎమోషనల్‌తో సాగే యాక్షన్ డ్రామా..

రేటింగ్: 2.75/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com