రెండేళ్ళ కాలానికి చెల్లుబాటయ్యేలా వాహన రిజిస్ట్రేషన్
- July 20, 2021
షార్జా: షార్జాలోని కొన్ని వాహనాల రిజిస్ట్రేషన్ ఇకపై రెండేళ్ళ గడువుతో లభించబోతోంది. ఈ విషయాన్ని షార్జా పోలీస్ విభాగం వెల్లడించింది. డిపార్టుమెంట్ ఆఫ్ వెహికిల్ మరియు డ్రైవర్ లైసెన్సింగ్ - షార్జా పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆయా వాహనాలు కొన్ని పరిమితులకు లోబడి ఈ రెండేళ్ళ గడువు రిజిస్ట్రేషన్ పొందవచ్చునని తెలుస్తోంది. వాహనం కొత్తదై వుండాలి. ఇన్స్యూరెన్స్ రెండేళ్ళకు చెల్లుబాటయ్యేలా వుండాలి. వాహనం, ప్రతి ఎమిరేట్‌లోని ట్రాఫిక్ అథారిటీ వద్ద రిజిస్టర్ అయి వుండాలి. సర్వీస్ సెంటర్ల ద్వారా సర్వీస్ పొందాలి.. వెబ్సైట్లు, స్మార్ట్ అప్లికేషన్లు (ట్రాఫిక్ డిపార్టుమెంట్ సంబంధిత) వర్తిస్తాయి. టెస్టింగ్ సెంటర్ వద్ద కారుని పరీక్షిస్తారు. క్వాలిటీ స్టాండర్డ్స్ వుంటే, రిజిస్ట్రేషన్ కార్డు (ముల్కియా) జారీ చేస్తారు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







