అమెరికా విమాన చార్జీలు అమాంతం పెంపు
- July 21, 2021
న్యూఢిల్లీ: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులకు విమానయాన సంస్థలు షాకిచ్చాయి. విమాన చార్జీలను అమాంతం పెంచేశాయి. కరోనా నేపథ్యంలో విమానాలు పరిమితంగా నడవడం, అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య భారీగా ఉండడమే ఇందుకు కారణం. మన దేశంతోపాటు అమెరికాలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.దీంతో భారత్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాలు వీసా జారీ ప్రక్రియను మొదలుపెట్టాయి.
వచ్చే నెల నుంచి అమెరికాలోని యూనివర్సిటీలు తెరుచుకోనున్న నేపథ్యంలో తొలుత విద్యార్థి వీసాలను మాత్రమే జారీ చేస్తున్నాయి. ఈసారి చాలా పెద్ద సంఖ్యలో విద్యార్థులకు వీసాలు లభించినట్టు తెలుస్తోంది. వీరందరూ అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, అంతర్జాయ విమాన సర్వీసులు ఇంకా పూర్తిస్థాయిలో మొదలు కాలేదు. దీంతో అమెరికాకు పరిమిత సంఖ్యలోనే విమానాలు నడుస్తున్నాయి. డిమాండ్‌కు సరిపడా సేవలు లేకపోవడంతో ఆయా సంస్థలు విమాన చార్జీలను అమాంతం పెంచేశాయి. మామూలుగా హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే విమానంలో ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.60 వేలు కాగా, ఇప్పుడది ఏకంగా రూ. 90 వేల నుంచి రూ. 2.20 లక్షల వరకు ఉంది.అయితే, అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా, ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానాల్లో ఇది రూ.90 వేలుగా ఉంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







