‘హీరో’ డబ్బింగ్ పూర్తిచేసిన జగపతి బాబు
- July 21, 2021
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ప్రిన్స్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘హీరో’. అమరరాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అశోక్ తల్లి పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ‘హీరో’ మూవీకి తమిళ సంగీత దర్శకుడు గిబ్రాన్ స్వరాలు అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఇప్పటికే సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న జగపతిబాబు డబ్బింగ్ సైతం కంప్లీట్ చేశారు.
ఆ విషయాన్ని జగ్గూబాయ్ డబ్బింగ్ థియేటర్ లో ఉన్న ఫోటోను జత చేస్తూ, తెలియచేసింది చిత్ర బృందం. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘హీరో’ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు విడుదల చేసిన ఈ మూవీ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రెస్పాన్స్ వస్తోంది. అశోక్ గల్లా తన తొలి చిత్రంలోనే కృష్ణ నటించిన ‘యమలీల’ మూవీలోని ‘జుంబారే జూజుంబరే’ సాంగ్ ను రీమిక్స్ చేసి, తనదైన స్టైల్ లో నర్తించడం విశేషం.
తాజా వార్తలు
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్‌కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్‌కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్‌లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ







