దేశ ప్రజలకు క్షమాపణ తెలిపిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్
- July 22, 2021
కాన్బెర్రా: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతుండడం, దాని వల్ల కేసులు పెరుగుతుండడంపై ప్రజలకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం ఆ దేశంలో కేవలం 11 శాతం మందికే వ్యాక్సిన్లు అందాయి. ధనిక దేశాలతో పోలిస్తే అత్యంత తక్కువ వ్యాక్సినేషన్ అది. దీనిపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
వ్యాక్సినేషన్ ఏమీ పరుగు పందెం కాదని ఒకప్పుడు అన్న ఆయనే.. ఇప్పుడు దిగొచ్చారు. ‘‘నేను విఫలమయ్యాను. ఈ ఏడాది ప్రారంభంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోలేకపోయాను. అందుకు క్షమాపణలు కోరుతున్నా. టీకా కార్యక్రమం ఇంత నెమ్మదిగా సాగుతున్నందుకు నేనే బాధ్యత తీసుకుంటున్నా. ఇప్పటికే ఎదురైన సవాళ్లన్నింటికీ నేనే బాధ్యుణ్ని. కొన్ని అంశాలు మన నియంత్రణలో ఉన్నాయి.. మరికొన్ని లేవు’’ అని ఆయన విచారం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సిడ్నీ, న్యూసౌత్ వేల్స్ లో రోజువారీ కేసులు పెరిగిపోతుననాయి. దీంతో సిడ్నీలో ఇప్పటికే లాక్ డౌన్ విధించారు. రాష్ట్రంలో కేసులు మరింత పెరిగే ప్రమాదముందని న్యూసౌత్ వేల్స్ అధ్యక్షురాలు గ్లేడిస్ బియర్జిక్లయన్ హెచ్చరించారు. కరోనా సోకినా చాలా మంది ఐసోలేషన్ లోకి వెళ్లట్లేదని, ఇలాంటి ప్రవర్తనలు చాలా ప్రమాదకరమని ఆమె అన్నారు. అందరికీ వ్యాక్సిన్ అందే వరకూ ఎవరికివారు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆంక్షలను తూచా తప్పక పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!







