యూఏఈ: జులై 28 వరకు ఇండియా, పాక్, లంక, బంగ్లాపై ట్రావెల్ బ్యాన్

- July 24, 2021 , by Maagulf
యూఏఈ: జులై 28 వరకు ఇండియా, పాక్, లంక, బంగ్లాపై ట్రావెల్ బ్యాన్

యూఏఈ: భారత్, పాక్, బంగ్లా, శ్రీలంక నుంచి యూఏఈ వెళ్లేందుకు ఎదురుచూస్తున్న ప్రవాసీయులకు మరోసారి నిరాశే ఎదురైంది.ఆయా దేశాలపై ట్రావెల్ బ్యాన్ ను ఈ నెల 28వరకు పొడిగిస్తున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సంస్థ ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా షెడ్యూల్ ఫ్లైట్ సర్వీసులను జులై 28 వరకు రద్దు చేస్తున్నట్లు దుబాయ్ ప్రధాన విమానయాన సంస్థ ఎమిరేట్స్ వెల్లడించింది.అలాగే యూఏఈ జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్ కూడా తమ ఫ్లైట్ సర్వీసులను జులై 31 వరకు రద్దు చేసిన విషయం తెలిసిందే. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ పై ట్రావెల్ బ్యాన్ ఈ నెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో ఆయా దేశాల్లో గత 14 రోజుల వ్యవధిలో పర్యటించిన వారికి కూడా యూఏఈలోకి ఎంట్రీ ఉండదని అధికారులు వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com