కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి విమర్శలు
- July 24, 2021
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉద్యోగాలు కావాలన్న ఉద్యమ ఆకాంక్షకు ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఉత్తరాది వారినే ఎక్కువగా నియమించారని, తెలంగాణ వారిపట్ల వివక్ష చూపిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ భవన్ ముందు నిన్న విద్యార్థులు ఆందోళన చేయడం జరిగింది. దానిపై స్పందిస్తూ రేవంత్ ట్వీట్ చేశారు.
‘‘మన ఉద్యోగాలు మనకు కావాలన్న ఉద్యమ ఆకాంక్షలకు టీఆర్ఎస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. కేసీఆర్ పాలనలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్యాయం ఎన్నో రెట్లు ఎక్కువైంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో తెలంగాణ బిడ్డలకు ఎదురవుతున్న వివక్షే అందుకు నిదర్శనం. ఈ ఆందోళనలన్నీ తుది దశ ఉద్యమానికి సంకేతాలు. సిద్ధంగా ఉండు కేసీఆర్’’ అంటూ ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







