కరోనా ఆంక్షలు ఎత్తివేసిన బహ్రెయిన్
- July 24, 2021
మనామా: మహమ్మారి కరోనా నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ నెమ్మదిగా సాధారణ జీవనంవైపు అడుగులేస్తోంది.దీనిలో భాగంగా శుక్రవారం నుంచి పలు మినహాయింపులు ఇచ్చింది. వ్యాపార సముదాయాలపై ఇన్నాళ్లు ఉన్న ఆంక్షలను తొలగించింది. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, కేఫ్స్, జీమ్స్, స్విమ్మింగ్ పూల్స్, బార్బర్ షాప్స్, సెలూన్, స్పాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది.అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, ఔట్‌డోర్ క్రీడా కార్యక్రమాలపై కూడా ఆంక్షలను పూర్తిగా తొలగించింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ రేటు బాగా తగ్గిన నేపథ్యంలో ఇంతకుముందు ఉన్న ఆరేంజ్ లెవెల్ అలర్ట్‌ను గ్రీన్ లెవెల్‌కు మార్చింది.ఈ మేరకు కరోనాపై ఏర్పడిన నేషనల్ మెడికల్ టాస్క్‌ఫోర్స్ కమిటీ శుక్రవారం కీలక ప్రకటన చేసింది.
ప్రభుత్వం ఆమోదించిన కరోనా వ్యాక్సిన్ లను రెండు డోసులు తీసుకున్న వారు,రెండో డోసు వేసుకుని 14 రోజులు అవుతున్న వారు, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారు స్పోర్ట్స్ ఈవెంట్, సినిమాలు,ఇండోర్ ఈవెంట్స్, సమావేశాలకు హాజరు కావొచ్చని కమిటీ పేర్కొంది. అలాగే ఎడ్యుకేషన్, ట్రైనింగ్ సంస్థలు కూడా సామాజిక దూరం,ముఖానికి మాస్క్ ధరించడం వంటి కరోనా నిబంధనలను పాటిస్తూ తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని వెల్లడించింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







