2021లో అత్యంత వేడివంతమైన నెలగా ఆగస్ట్

- July 24, 2021 , by Maagulf
2021లో అత్యంత వేడివంతమైన నెలగా ఆగస్ట్

సౌదీ: నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్‌సిఎం) అధికార ప్రతినిథి హుస్సేన్ అల్ కహ్తానీ మాట్లాడుతూ, రానున్న ఆగస్ట్ నెల, 2021లోనే అత్యంత వేడివంతమైన నెల కాబోతోందని చెప్పారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గగానే ఉష్ణోగ్రతలు పెరడం ప్రారంభమవుతుందని అన్నారాయన. సౌదీ అరేబియా తీర ప్రాంతాల్లో హ్యుమిడిటీ అత్యంత ఎక్కువగా వుండబోతోంది. నిజ్రాన్ మరియు రియాద్‌లలో వీటి ప్రభావం చాలా ఎక్కువ. 1991 తరహాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఎన్‌సిఎంకి చెందిన క్లైమేట్ సర్వీస్ డిపార్టుమెంట్ కొన్ని వారాల క్రితమే హెచ్చరించిన విషయం విదితమే. కాగా, గడచిన మూడేళ్ళలో ఎన్నడూ లేని విధంగా గత మే నెలలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com