టమాటా జార్లలో స్మగ్లింగ్: గుట్టు రట్టు చేసిన సౌదీ కస్టమ్స్

- July 24, 2021 , by Maagulf
టమాటా జార్లలో స్మగ్లింగ్: గుట్టు రట్టు చేసిన సౌదీ కస్టమ్స్

సౌదీ అరేబియా: కస్టమ్స్ అధికారులు అల్ హదితా పోర్టు వద్ద, 2.1 మిలియన్ కాప్టగాన్ పిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వీటిని  టమాటా పేస్ట్ జార్లలో స్మగ్లింగ్ చేసేందుకు యత్నించారు. ఎక్స్-రే మెషీన్లతో తనిఖీలు చేస్తుండగా, ఓ ట్రక్కులో వీటిని గుర్తించారు అధికారులు. స్మగ్లింగ్ విషయమై అత్యంత అప్రమత్తంగా వుంటున్నామనీ, సరికొత్త పద్ధతుల్లో నిందితులు స్మగ్లింగ్ చేస్తుండగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి యత్నాలకు అడ్డుకట్ట వేయగలుగుతున్నామని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com