చౌక ఇళ్ల నిర్మాణానికి ఐసీఐసీఐ బ్యాంక్ తక్కువ వడ్డీకే గృహరుణం
- March 10, 2016
ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద చౌక ఇళ్ల నిర్మాణానికి ఐసీఐసీఐ బ్యాంక్ తక్కువ వడ్డీకే గృహరుణం ఇచ్చే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గరిష్ఠంగా రూ.6 లక్షల వరకు రుణం లభిస్తుంది. దీనిపై చెల్లించాల్సిన వడ్డీపై ఏడాదికి 6.5 శాతం రాయితీని నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ) ఇస్తుంది. ఈమేరకు ఎన్హెచ్బీతో ఐసీఐసీఐ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు కుటుంబంలో ఎవరి పేరు మీద ఇల్లు లేని అల్పాదాయ, వెనుకబడిన వర్గాల వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అలాగే బ్యాంకులు ఇస్తే రూ.12-15 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు.కానీ వడ్డీ రాయితీ రూ.6 లక్షల వరకే పరిమితం.
తాజా వార్తలు
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన







