ప్రధాని మోదీని కలిసిన గవర్నర్ బండారు దత్తాత్రేయ

- July 26, 2021 , by Maagulf
ప్రధాని మోదీని కలిసిన గవర్నర్ బండారు దత్తాత్రేయ

న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ.హర్యానా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నేడు ఢిల్లీ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు బండారు దత్తాత్రేయ.ఈ సందర్భంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ క్షేమ సమాచారాన్ని అడిగి తెలుకున్నారు ప్రధాన మంత్రి.అలాగే…హరియాణా రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న ప్రధాని…కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో గవర్నర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.ఇక ప్రధాన మంత్రి మోదీ భేటీ తన మరింత స్ఫూర్తినిచ్చిందని తెలిపారు గవర్నర్ బండారు దత్తాత్రేయ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com