లైట్ రైల్ మెట్రో కోసం మస్కట్ సన్నాహాలు

- July 27, 2021 , by Maagulf
లైట్ రైల్ మెట్రో కోసం మస్కట్ సన్నాహాలు

మస్కట్: రువీ మరియు ముట్రాల నుండి సీబ్ మరియు ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు వీలుగా మెట్రో నెట్‌వర్క్ యత్నాలు జరుగుతున్నాయి. రానున్న 20 ఏళ్ల అవసరాలను ద‌ృష్టిలో పెట్టుకుని ఒమన్ నేషనల్ స్పేటియల్ స్ర్టాటజీలో భాగంగా రూపొందించిన ప్రణాళిక నిమిత్తం ఈ మెట్రో రూపకల్పన చేయనున్నారు. ఇందుకోసం లైట్ రైల్ మెట్రోని మెరుగైన ఆలోచనగా భావిస్తున్నారు. ఆఫీసులు, రిటైల్ స్టోర్లు వంటి వాటిని కూడా ఈ ప్రాజెక్టుతో కనెక్ట్ చేస్తారు. పార్కులు, నడక మార్గాలు వంటి వాటిని ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేస్తారు. సీబ్ నుండి సోహార్ ప్రాంతాన్ని కలిపేలా రవాణా మార్గాన్ని అభివృద్ధి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com