అమెరికాలో మళ్లీ మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ఆంక్షలు విధించిన ప్రభుత్వం

- July 28, 2021 , by Maagulf
అమెరికాలో మళ్లీ మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ఆంక్షలు విధించిన ప్రభుత్వం

అమెరికాలో డెల్టా వేరియంట్ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆరోగ్యశాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. రిస్క్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించాలని ఆదేశించింది. ఇండోర్స్‌లో ఉన్నవాళ్లు తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలని సూచించింది. అమెరికన్లు వ్యాక్సినేషన్ పట్ల శ్రద్ధ చూపాలని అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. వ్యాక్సిన్లు ప్రభావంతంగా పనిచేస్తున్నా.. డెల్టా వేరియంట్ కేసులు అక్కడక్కడ పెరుగుతున్నాయని, అందుకే ఆ రిస్క్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కచ్చితంగా మాస్క్‌లు ధరించాలని అంటువ్యాధి నిపుణుల డైరక్టర్ రోచెల్లి వాలెన్స్కీ తెలిపారు. పూర్తి స్థాయిలో వ్యాక్సినేట్ అయిన వ్యక్తులు కూడా ఇండోర్ ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోవాలని సీడీసీ సూచినట్లు రోచెల్లి చెప్పారు. సీడీసీ డేటా ప్రకారం.. దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో వైరస్ వ్యాప్తి జరుగుతున్నట్లు గుర్తించారు. ఇక అత్యధికంగా టీకాలు తీస్తున్న ఈశాన్య ప్రాంతంలో వైరస్ ట్రాన్స్‌మిషన్ స్వల్ప స్థాయిలో ఉన్నట్లు తేల్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com